రానా ఘాజికి స్టార్ కలరింగ్..!

దగ్గుబాటి హీరో రానా హీరోగా నటిస్తున్న సినిమా ఘాజి వచ్చే నెలలో రిలీజ్ అవబోతుంది. 1971 టైంలో సముద్రంలో జరిగిన యుద్ధానికి సంబందించిన కథాశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మించారు. తెలుగు తమిళ హింది భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు స్టార్ కలరింగ్ కూడా అద్దుతున్నారు.

డిఫరెంట్ కథతో వస్తున్న ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, తమిళంలో విలక్షణ నటుడు సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. ఈ ఇద్దరు ఈ సినిమాకు ఇస్తున్న సపోర్ట్ కు సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఓ కొత్త అటెంప్ట్ అని అంటున్నారు. మరి సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్న రానా రిజల్ట్ మీద కూడా నమ్మకంగానే ఉన్నారు.