
మాస్ మహరాజ్ రవితేజ సంవత్సరం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలకు ముహుర్తం పెట్టేస్తున్నాడు. రీసెంట్ గా రెండు సినిమాలను ఎనౌన్స్ చేయడమే కాదు వాటి ఫస్ట్ లుక్ తో మెస్మరైజ్ చేసిన రవితేజ ఆ సినిమాల్లో క్రేజీ హీరోయిన్స్ తో జోడి కడుతున్నాడు. విక్రం సిరి డైరక్షన్ లో రాబోతున్న టచ్ చేసి చూడు సినిమాలో రాశి ఖన్నా ఓ హీరోయిన్ గా సెలెక్ట్ అవగా ఇప్పుడు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కూడా సెలెక్ట్ అయ్యిందట.
తన మార్క్ క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. శ్రీనువైట్ల వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మడు ఇంకా రెండు సినిమాల్లో చేస్తుంది. ఇక రవితేజతో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ అయిన పోస్టర్ లో రవితేజ లుక్ సూపర్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో కూడా సినిమా తీస్తున్నాడు రవితేజ. రాజా ది గ్రేట్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.