
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరాధ్యుడిగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ మరోసారి పవర్ స్టార్ మీద ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగా పవన్ కళ్యాణ్ ఓ శక్తి అని.. సంస్కారం ఎక్కువున్న మనిషని, గాడ్ మెక్ ఎ రేర్ పీస్ పవన్ అని అన్నారు. అంతేకాదు కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని, పవన్ కళ్యాణ్ సిఎం అవడం ఆంధ్ర ప్రజల అదృష్టమని అన్నారు.
ఇక తన గురించి బయట వినపడుతున్నదంతా అవాస్తవమని చెప్పిన బండ్ల గణేష్ తనను తక్కువ అంచనా వేస్తున్నారని తన కెపాసిటీ ఏంటో తనకు మాత్రమే తెలుసని అన్నారు. ఎన్.టి.ఆర్ బాద్షా టైంలో తన గురించి తప్పుగా మాట్లాడినందుకు ఎన్.టి.ఆర్ కు తన ఫ్యాన్స్ కు సారీ చెప్పారు బండ్ల గణేష్. సినిమా మీద ఇష్టంతో చిన్న చిన్న వేశాలు వేస్తూ ఈ స్థాయికి రాడానికి తన కష్టమే కారణమని.. తాను ఎవరికి బినామి కాదని.. తను బ్రోకరేజ్ కూడా చేయలేదని అన్నాడు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూలో తన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పిన బండ్ల గణేష్ నిర్మాత రామానాయుడు గారు అంటే ఇష్టమని.. ఆయనలా ఓ పెద్ద స్టూడియో కూడా కట్టి తన కొడుకులలో ఒకరిని నిర్మాత చేస్తానని అన్నారు.