
తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ ది ఓ శాసనం.. రెండు దశాబ్ధాలు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న మెగాస్టార్ పదేల్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా రీ ఎంట్రీ ఇచ్చి ఖైది నంబర్ 150 సినిమా చేశారు చిరంజీవి. అన్నయ్య కోసం ఎదురుచూసిన కళ్లన్ని తమ హీరోని అలా చూస్తూ ఉండిపోయారు. ఖైది సృష్టించిన కలక్షన్ల సంచలనమే దీనికి ఉదాహరణ. అయితే మెగాస్టార్ ఖైది నంబర్ 150 సినిమా చూసిన వెంటనే మెగా అభిమాని అయిన సునీల్ చిరుని కలిశాడు.
మాలాంటివారందరికి స్పూర్తిగా నిలిచిన మీరు మళ్లీ సినిమాల్లోకి వచ్చినందుకు థాంక్స్ అని.. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ మిమ్మల్ని మిస్ అవుతానో అని రెప్పకూడా వేయలేదని అన్నాడట సునీల్. రీ ఎంట్రీ మమ్మల్ని ఆనందపరచిందంటూ చిరుతో ముచ్చట్లాడాడట సునీల్. అయితే సునీల్ గ్రీటింగ్స్ ను సంతోషంగా స్వీకరించిన చిరు అందరూ ఇదే చెబుతున్నారని అభిమానులు లేకుండా తాను ఈ స్టేజ్ కు వచ్చేవాడిని కాదని వారి వల్లే ఖైది నంబర్ 150 అంత పెద్ద హిట్ అయ్యిందని అన్నారట.