ఎన్టీఆర్ తో లక్కీ త్రీ ఎవరో..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో చేస్తున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇక సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఫైనలైజ్ చేయాలా అని కన్ ఫ్యూజన్ లో ఉన్నారు చిత్రయూనిట్. కళ్యాణ్ రాం నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు జై లవకుశ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కెరియర్ లో మొదటిసారి తారక్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారని టాక్.

స్టార్ హీరోయిన్స్ తో ఇప్పటికే అందరితో కలిసి నటించిన ఎన్.టి.ఆర్ ఈసారి కొత్త హీరోయిన్స్ ను ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆ క్రమంలో ప్రస్తుత్మ ఫాంలో ఉన్న కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ పేర్లు పరిశీలణలో ఉన్నాయి. వీరే కాకుండా రాశి ఖన్నా, నివేదా థామస్, కాజల్ పేర్లు కూడా వినపడుతున్నాయి. కావాల్సింది ముగ్గురు అనుకుంటుంది ఐదుగురు. మరి వీరిలో ఆ లక్కీ త్రీ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి సెప్టెంబర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.