కథ ఏదైనా మెగాస్టార్ హీరోయిన్ ఫిక్స్..!

సంక్రాంతికి ఖైది నంబర్ 150గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎంతో లేట్ చేయకుండానే తన తర్వాత సినిమాను షురూ చేయాలని చూస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత వచ్చినా తనని అభిమానులు ఆదరించిన తీరు చూసి ఆశ్చర్యపోయిన చిరంజీవి వారికి వెంటనే మరో సినిమా గిఫ్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ క్రమంలో 151వ సినిమా ఉయ్యాల నరసింహారెడ్డి బయోపిక్ ఉంటుందని తెలుస్తుంది. 

మెగా హీరోలకు సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు ధ్రువ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. అయితే కథ అది అవునో కాదో తెలియదు కాని మెగాస్టార్ 151వ సినిమా డైరక్టర్ గా సురేందర్ రెడ్డి హీరోయిన్ గా అనుష్క కూడా ఫిక్స్ అని అంటున్నారు. అసలైతే ఖైది నంబర్ 150కే అనుష్కను తీసునే ప్రయత్నం చేసినా అది కుదరలేదు. అందుకే 151వ సినిమాకు పక్కాగా అనుష్కను తీసుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ స్టాలిన్ సినిమాలో అనుష్క మెగాస్టార్ తో చిందులేసింది.