శాతకర్ణి విషయంలో రాజమౌళిని బుక్ చేశారు..!

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రత్యేకత తెలుసుకుని సినిమాకు ఓ అగ్ర దర్శకుడిగా రాజమౌళి ప్రశంసలు అందించడమే కాకుండా సినిమా దర్శకుడు క్రిష్ తో సినిమా విషయాలతో కూడిన ఇంటర్వ్యూ కూడా చేశాడు. అయితే ఇంతటితో ఆగకుండా శాతకర్ణి సినిమా గొప్పతనం గురించి ఓ లెటర్ కూడా రాయడం కాస్త అతి అనిపించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాల్లో కేవలం జక్కన్న శాతకర్ణికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. 

ఈ కారణం చేత రాజమౌళి మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేస్తుండగా.. వేది తగిలిన రాజమౌళి అసలు తాను ఏ లెటర్ రాయలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం శాతకర్ణి పబ్లిసిటీ టీం ప్రిపేర్ చేసిన లెటర్ రాజమౌళి రాశాడన్నట్టుగా ప్రచారం చేశారన్నమాట. విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ కాస్త కూల్ అయినా ఇలాంటి తప్పుడు ప్రచారాలతో సినిమాకు వచ్చిన మాంచి పేరు ఎందుకు పోగొడతారని కొందరంటున్నారు. ఈ విషయంపై రాజమౌళి స్పందించడం మంచి జరిగిందనే అనాలి. లేదంటే మెగా కాంపౌండ్ రాజమౌళి మధ్యా దూరం పెరిగేది.