వర్మకు పవన్ స్ట్రోక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏపి స్పెషల్ స్టేటస్ గురించి కొద్ది నిమిషాల క్రితం ఓ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను టార్గెట్ చేశాడు. అయితే ప్రెస్ మీట్ మధ్యలో ఓ రిపోర్టర్ రాం గోపాల్ వర్మ గురించి అడుగగా.. తాను వర్మ గురించి ఇదే మొదటి చివరి సారి మాట్లాడటం అని.. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి.. మొన్నాంధ్యనే తన కూతురికి వివాహం కూడా జరిపించాడు. అలాంటి వ్యక్తి పోర్నోగ్రఫి కలెక్ట్ చేస్తానని చెప్పే అతని గురించి నేను ఏం మాట్లాడను.. నాకు అంత టైం కూడా లేదు. నన్ను ఓ రోజు ఎత్తినా తగ్గించినా తన గురించి నేను ఏం మాట్లాడను అనేసి వర్మకు గట్టి షాక్ ఇచ్చారు పవన్.

కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ వ్యవహారం చాలా దాకా తీసుకెళ్లాడు. అయితే తాను చేసేది సరదాకా లేక ఇంటెన్షనల్ గానా అనేది పక్కన పెడితే అనవసరపు రచ్చ మొదలవుతుంది. అందుకే వర్మ గురించి ఇదే మొదటి చివరి సారి అని అసలు అతని గురించి ఏం మాట్లాడతాం అని పవన్ గట్టి స్ట్రోక్ ఇచ్చేశాడు.