
మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు గిఫ్టులను అందిస్తున్నాడు రవితేజ. బెంగాల్ టైగర్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన రవితేజ వాటిని ముగించుకుని వచ్చి ఒకేసారి రెండు సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు విక్రం సిరి దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' కాగా.. మరోటి సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న 'రాజా ది గ్రేట్'.
ఫిబ్రవరి నుండి ఈ రెండు సినిమాల షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు రవితేజ. విక్రం సిరికొండ డైరక్షన్ లో మూవీ టచ్ చేసి చూడు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా అందులో రవితేజ లుక్ కేక పెట్టిస్తుంది. ఇక అనీల్ రావిపుడి సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. భద్ర తర్వాత దిల్ రాజుతో సినిమా చేస్తున్న రవితేజ ఈ రాజా ది గ్రేట్ కూడా అదే రేంజ్ హిట్ అందుకుంటాడని చెబుతున్నారు. మరి రవితేజ మాస్ సినిమాలకు అలవాటు పడ్డ ఫ్యాన్స్ కు ఈ ఇయర్ లో రెండు సినిమాల గిఫ్ట్ అందిస్తున్నాడు రవితేజ. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.