
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. జనతా గ్యారేజ్ తో సూపర్ క్రేజ్ సంపాదించిన మోహన్ లాల్ మనమంతాలో కూడా మంచి మార్కులే కొట్టేశారు. ఇక ఆ తర్వాత మన్యం పులిగా మలయాళ సూపర్ హిట్ మూవీ పులి మురుగన్ ను డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు అక్కడ హిట్ అయిన మరో మూవీ ఒప్పం సినిమాను తెలుగులో కనుపాపగా రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఇదే కాకుండా 1971 బియాండ్ బోర్డర్స్ అనే సినిమా ప్రస్తుతం మలయాళంలో చేస్తున్న మోహన్ లాల్ ఆ సినిమాను తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ ప్లాన్ తోనే అల్లు శిరీష్ ను ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయిస్తున్నారు. మేజర్ రవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 1971లో ఇండో పాక్ యుద్ధానికి సంబందించిన కథగా తెరకెక్కుతుంది. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. డబ్బింగ్ సినిమాలతో కూడా మోహన్ లాల్ తెలుగు మార్కెట్ పై తన దండయాత్ర చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో కల్నల్ మహదేవన్, మేజర్ సహదేవన్ గా డ్యుయల్ రోల్ చేస్తున్నారు మోహన్ లాల్.