
ఈ సంక్రాంతికి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. తెలుగు రెండు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో ఈ సినిమా మీద ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే అక్కడ ప్రమోషన్స్ బాగా చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ లో 1.6 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ సాధించిన శాతకర్ణి సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి కొద్దిపాటి గ్యాప్ తప్పించి చిత్రయూనిట్ అంతా కష్టపడుతూనే ఉంది.
ఇక ఫారిన్ టూర్ పూర్తి చేసుకుని వచ్చిన శాతకర్ణి టీంకు బాలయ్య ఓ గ్రాండ్ కాక్ టైల్ పార్టీ ఇస్తున్నాడట. సినిమాకు పని చేసిన అంతా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ పార్టీకి అటెండ్ అవ్వాలని బాలకృష్ణ చెప్పారట. బాలయ్య పిలిస్తే రాకుండా ఉంటారా చెప్పండి. రేపు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ పార్టీ జరుగనున్నదట. బాలయ్య స్వయంగా ఇస్తున్న ఈ పార్టీకి కేవలం సినిమాకు పనిచేసిన యూనిట్ మాత్రమే ఎంట్రీ అవకాశం ఉందట. ఇన్నాళ్లు సినిమా కోసం కష్టపడి ఇక ఇప్పుడు ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటున్నారు శాతకర్ణి టీం.