ఈ మహేష్ బాబుకు ఏమైంది..?

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏమైంది ప్రస్తుతం ఈ ప్రశ్న తన అభిమానులకే రావడం విశేషం. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మురుగదాస్ సినిమా స్టార్ట్ చేసిన మహేష్ ఆ సినిమా షూటింగ్ పిక్స్ బయటకు వస్తున్నా సరే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంటివి రిలీజ్ చేయట్లేదు. కనీసం ఇప్పటిదాకా టైటిల్ కూడా ఎనౌన్స్ చేయలేదు. అయితే ఇదంతా పక్కా ప్లానింగ్ అంటూ చిత్రయూనిట్ చెప్పుకొస్తున్నా తమ అభిమాన నటుడి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.

దసరా, దీపావళి పండుగలకు రిలీజ్ చేయకున్న న్యూ ఇయర్ కు మహేష్ నుండి పక్కా గిఫ్ట్ వస్తుందని ఆశించారు. కాని న్యూ ఇయర్ కూడా మహేష్ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక అప్పుడు అడిగితే జనవరి 26న టీజర్ పక్కా అన్నారు. తీరా చూస్తే ఈరోజు కూడా టీజర్ కాదు కదా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఓ పక్క జల్లికట్టుకి తన మద్ధతంటూ ఉదారంగా చెప్పిన మహేష్. వైజాగ్ లో జరుగుతున్న స్పెషల్ స్టేటస్ గురించి కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. 

వర్మ లాంటి వాళ్లు మహేష్ ను టార్గెట్ చేస్తున్నా సరే మహేష్ సైలెంట్ గా ఉండటం వెనుక కారణాలేంటో తెలియడం లేదు. జల్లికట్టుకి సపోర్ట్ ఇచ్చి ఇరుక్కున్న మహేష్ ప్రస్తుతం ఏపి స్పెషల్ స్టేటస్ మీద అయినా తన స్పందన తెలియచేస్తాడా లేడా అన్నది ఫ్యాన్స్ లో ఉత్కంట ఏర్పడింది. మరి మహేష్ మైనం విడిచి ఏదో ఒకటి చేస్తే మంచింది. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.