దేవసేనతో విల్లు పట్టుకున్న బాహుబలి..!

బాహుబలి-2 షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక అందులో భాగంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరేంద్ర బాహుబలి, దేవసేన కలిసి ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. దేవసేనకు విల్లు ఎక్కు పెట్టడం నేర్పుతున్న బాహుబలి పోస్టర్ అదరగొడుతుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పోస్టర్ ఉంది. 

బాహుబలి బిగినింగ్ తో సంచలన విజయం అందుకున్న రాజమౌళి అంతకన్నా ఎక్కువ విజయం సాధించాలని పార్ట్ 2ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి పార్ట్ -2 కూడా సత్తా చాటాలని చూస్తుంది. రిలీజ్ అవుతున్న పోస్టర్స్ కూడా అంచనాలు పెంచేస్తున్నాయి. బిగినింగ్ లో కేవలం ఓల్డ్ గెటప్ లో కనిపించిన అనుష్క పార్ట్ -2 లో ప్రభాస్ తో రొమాన్స్ కూడా చేస్తుందట. ఇద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని తెలుస్తుంది.