మోక్షజ్ఞతో క్రిష్ 'శ్రావణి'..!

నందమూరి బాలకృష్ణ వందవ సినిమా అంచనాలకు తగ్గట్టుగా శాతకర్ణి సక్సెస్ అందించిన క్రిష్ కు బాలయ్య తనయుడి అరగేట్రం బాధ్యతలను కూడా అప్పగించాడని వినిపిస్తున్న టాక్. అయితే ఈ ఇద్దరు చేసే సినిమా కూడా చారిత్రాత్మక కథ అని అంటున్నారు. శాతకర్ణి కుమారుడు పులోమావి కథతో ఈ సినిమా తెరకెక్కుతుందట. అయితే ఈ సినిమా మంచి ప్రేమకథగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.

పులోమావి, శ్రావణిల ప్రేమ కథతో ప్రముఖ రచయిత శ్రావణి అనే నవల రాశారు. ఆ నవల ఆధారంగానే మోక్షజ్ఞ మొదటి సినిమా తెరకెక్కబోతుందని అంటున్నారు. శాతకర్ణితో క్రిష్ ప్రతిభ చూసిన బాలకృష్ణ తనయుడి తెరంగేట్రానికి సరైన దర్శకుడు అతనే అని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే మోక్షజ్ఞ సినిమా తన నిర్మాణంలోనే అని నిర్మాత సాయి కొర్రపాటి ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి.