పవన్ తో సమంత యూ టర్న్..!

ఓ పక్క సినిమా అవకాశాలు మందగించడంతో మళ్లీ తన రేంజ్ సినిమాలతో ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది సమంత. అందుకే ఇంతకుముందు తన దాకా వచ్చి ఆగిపోయిన సినిమాలను మళ్లీ ట్రాక్ ఎక్కించేస్తుంది. ఆ క్రమంలోనే కన్నడ సూపర్ హిట్ మూవీ యూ టర్న్ సినిమా అసలైతే సమంత ఓకే అంటే తెలుగులో రీమేక్ చేద్దామని ప్రయత్నాలు చేశారు. సమంత కూడా మొదట్లో ఒకే అన్నట్టు కనిపించినా తర్వాత చేయనంది. అయితే ఇప్పుడు ఎలాగు అవకాశాలు లేవు కాబట్టి ఆ రీమేక్ చేయాలని ఉత్సాహపడుతుంది సమంత.

పవన్ కుమార్ డైరెక్ట్ చేసిన యూ టర్న్ మూవీ 2016 కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. క్రైం థ్రిల్లర్ కథాంశంత్ తెరకెక్కే ఈ సినిమా తెలుగులో సమంతతో చేయాలని ఆ డైరక్టర్ ఎనౌన్స్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ డైరక్టర్ తోనే సమంత యూ టర్న్ సినిమా చేస్తుందట. ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారు. సినిమాలో లీడ్ రోల్ ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. సో మొత్తానికి అవకాశాలు లేవు అనుకుంటూనే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటుంది సమంత.