
టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటుందన్నదని తెలిసిన వార్తే.. అందుకే ఇక్కడకి వచ్చిన ఏ హీరోయిన్ అయినా దాదాపు క్లిక్ అవుతుంది. ఇక కాస్త అందం అభినయం చూపిస్తే ఆమెను ఒకటి రెండు సినిమాలకే స్టార్ హీరోయిన్ ను చేసేస్తారు. ఈ క్రమంలో ప్రేమం బ్యూటీ అనుపమ అంటే ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అఆ, ప్రేమం సినిమాల్లో చిన్న రోల్స్ చేసినా సరే ఆమె సోలోగా వచ్చిన శతమానం భవతితో సూపర్ హిట్ అందుకుంది అనుపమ.
ఇక ఆ తర్వాత చరణ్ సుకుమార్ ఛాన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మరో సినిమా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యాయి. దీనికి కారణాలు జోడి కుదరక అంటూ ఏవేవో కారణాలు చెప్పారు కాని అసలు కారణం అమ్మడు రెమ్యునరేషన్ పెంచడమే అని తెలుస్తుంది. నిన్న మొన్నటిదాకా 20-30 లక్షలు తీసుకున్న అనుపమ ఇప్పుడు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని సినిమాకు 60 లక్షలు ఫైనల్ అంటుందట. అందుకే అంత పెట్టి ఆమెను తీసుకునే బదులు స్టార్ హీరోయిన్స్ వస్తారు కదా అని ఆమెను తప్పించారని అంటున్నారు. మొత్తానికి కెరియర్ మొదట్లోనే రెమ్యునరేషన్ షాక్ ఇస్తున్న అనుపమ ఇలానే ఉంటే మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉండదు.. ఆ విషయం ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో మరి.