
ఐటం సాంగ్స్ కు ఇప్పుడు హీరోయిన్స్ మాత్రమే పోటీ పడుతుండగా కొత్తగా పవర్ స్టార్, మెగాస్టార్ సినిమాల్లో వరుసగా ఐటం సాంగ్ చేసి క్రేజ్ సంపాదించింది రాయ్ లక్ష్మి. సర్దార్ గబ్బర్ సింగ్ లో తోబ తోబ సాంగ్ తో పాటుగా మెగాస్టార్ 150వ మూవీ ఖైది నంబర్ 150లో రత్తాలు సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది రాయ్ లక్ష్మి. వచ్చిన అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకున్న అమ్మడు మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఎక్కించింది.
అయితే ఇప్పుడు ఆ రత్తాలు మెగా క్యాంప్ నుండి నందమూరి ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్లో చేస్తున్న జై లవకుశ మూవీలో రత్తాలు అదేనండి రాయ్ లక్ష్మితో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబినే కాబట్టి రాయ్ లక్ష్మిని బాబినే ప్రిఫర్ చేశాడట. రత్తాలుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఐటం సాంగ్ సినిమాకు కూడా ఎంతోకొంత ప్లస్ అవుతుందని తరక్ కూడా ఓకే అన్నాడట. మరి హీరోయిన్ గా ఎప్పుడు ఫేడవుట్ అయిన రాయ్ లక్ష్మి ఐటం గాళ్ గా అయినా కొద్దిరోజులు ఉంటుందేమో చూడాలి.