మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 ప్రస్తుతం బాక్సాఫీస్ మీద చేస్తున్న దండయాత్ర చూస్తూనే ఉన్నాం. పదేళ్లు అవుతున్నా అదే మెగా పవర్ తో మెగాస్టార్ తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు. అయితే ఈ క్రమంలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా తన 151వ సినిమాను కూడా ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు చిరంజీవి. ఇక 151 సినిమాగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ ఉంటుందని తెలుస్తుంది.
పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో రాసిన ఈ కథ మీద చిరు ఎప్పుడో మనసు పడ్డాడు. ఖైది తో గ్రాండ్ రీ ఎంట్రీ దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ బయోపిక్ తో తన 151వ సినిమా చేయాలని చూస్తున్నాడు చిరు. ఇక ఈ సినిమా డైరక్టర్ గా మొన్నటిదాకా బోయపాటి శ్రీను అనుకున్నారు కాని ధ్రువతో చెర్రికి మెమరబుల్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఫైనల్ అయినట్టు టాక్. మెగా హీరోలతో సురేందర్ రెడ్డి తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయి. ఆ సెంటిమెంట్ తో కూడా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారట.
1857 టైంలో మొదటి స్వాతత్య ఉద్యమం జరగడానికి ముందు తన వీరత్వం చూపించి దేశం కోసం అప్పుడే ప్రాణాలను వదిలిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర చాలా గొప్పది. ఎన్నాళ్ల నుండో చిరంజీవి ఆయన బయోపిక్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. మరి ఇప్పటికైనా అది కుదురుతుందో లేదో చూడాలి.