ఆ వీడియోలో ఉంది నేను కాదు..!

కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు ప్రతిభ కలవాడో అందరికి తెల్లిసిందే. వై దిస్ కొలవెరి ది అంటూ ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన ఈ కుర్రాడి మీద గాసిప్పులు కూడా అధికమే. అప్పట్లో ఓ హీరోయిన్ తో సారు ఘాటు ముద్దులు సోషల్ సైట్స్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో  అలాంటి ఇమేజ్ ఏర్పరచుకున్న అనిరుథ్ ప్రస్తుతం మళ్లీ ఓ సమస్యలో చిక్కుకున్నాడు.  

ఓ తమిళ నటితో హాట్ వీడియో ఒకటి కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు వ్యక్తి అనిరుథ్ లా ఉండటమే ఇక్కడ విశేషం. అందులో ఉన్నది కచ్చితంగా అనిరుథ్ అని కొందరంటుంటే మరికొందరు మాత్రం కాదని వారిస్తున్నారు. ఇలానే ఉంటే ఇంకా ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అని ఆ వీడియోలో ఉన్నది తాను కాదని వివరణ ఇచ్చాడు అనిరుథ్. అందులో ఉన్నది తనే అని అంటున్న వారు కళ్లు చెకప్ చేయించుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు. 

మరి కుర్రాడి స్పీడ్ చూసి ఇలాంటివి పుట్టిస్తున్నారా లేక మనోడిలో ఆ యాంగిల్ ఒకటి ఉందా అన్నది తెలియదు కాని ఇలాంటి విషయాల మీద అనిరుథ్ మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తారు కోలీవుడ్ ప్రేక్షకులు.