
మాస్ మహరాజ్ రవితేజ ఫ్యాన్స్ కు తన పుట్టినరోజుకి ఓ రోజు ముందుగానే గిఫ్ట్ అందించాడు రవితేజ. బెంగాల్ టైగర్ తర్వాత సినిమాలకు దాదాపు సంవత్సరం పాటు దూరంగా ఉన్న రవితేజ ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చాడు. ఇక ఇప్పుడు తన సినిమాల జోరుని పెంచాడు. ఇప్పటికే అనీల్ రావిపూడి డైరక్షన్ లో ఓ సినిమా కమిట్ అవగా విక్రం సిరికొండ అనే నూతన దర్శకుడితో కూడా టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్రేజ్ సంపాదించుకున్నాడు రవితేజ. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ తన జోష్ ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు శ్రీనివాస్ వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ ను భలే ఎంటర్టైన్ చేస్తుంది. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమా త్వరగానే పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.