ఎన్టీఆర్ లో ఆ టాలెంట్ కూడా ఉందట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఎవరు ఊహించని ఓ టాలెంట్ ఉందని తెలుస్తుంది. అదేంటి అంటే స్వయం పాకం.. తన వంట తానే చేసుకుంటాడట తారక్. ఇంకా చెప్పాలంటే బాగా ఒత్తిడిగా ఉన్న సమయాల్లో తాను ఒంట చేస్తానని అంటున్నాడు జూనియర్. తన వంట తనకు మాత్రమే కాదు ఇతరలు కూడా తినేందుకు సూపర్ అంటారని తెలుస్తుంది.

భారీ డైలాగులే కాదు మస్త్ జబర్దస్త్ వంటకాలు కూడా తారక్ చేస్తాడన్నమాట. డిప్రెషన్ లో ఒక్కొక్కరు ఒక్కోలా తమ ఒత్తిడిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు తారక్ మాత్రం ఎప్పుడు కాస్త డిప్రెషన్ గా అనిపించినా సరే వంటగదిలోకెళ్లి వంట ప్రారంభించేస్తాడట. లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ హిట్ తో మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చిన తారక్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్నాడు.