
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ సినిమా కేవలం తనకు మాత్రమే కాదు అందులో నటిస్తున్న ఆర్టిస్ట్ లకు కూడా దిశానిర్దేశం కలిగించేదే అని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో విలన్ గా నటిస్తున్న ప్రేమిస్తే భరత్ మహేష్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో కలిసి నటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన భరత్ ఆ సినిమా రిజల్ట్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు.
సినిమా కచ్చితంగా తనకు మంచి పేరు తీసుకొస్తుందని అంటున్నాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా మరిన్ని ఆఫర్లు వస్తాయని ఆశతో ఉన్నాడు. మురుగదాస్ మహేష్ సినిమాలో అసలు విలన్ ఎస్.జె.సూర్య కాగా భరత్ కూడా మరో విలన్ గా నటిస్తున్నాడు. హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.