
రాం గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి సినిమా ఎనౌన్స్ చేస్తాడో ఎవరికి తెలియదు.. ప్రస్తుతం బాలీవుడ్ లో అమితాబ్ తో సర్కార్ 3 సినిమా చేస్తున్న ఆర్జివి ఇప్పుడు మరో సంచలనానికి నాంధి పలికాడు. కత్తులు రక్తపాతాలతో ఈమధ్య కాలంలో సినిమాలు చేస్తున్న వర్మ ప్రస్తుతం ఓ రొమాంటి ఎంటర్టైనర్ తీయాలని అనుకుంటున్నాడట. దానికి టైటిల్ గా ‘బ్యూటిఫుల్’ అని పెట్టాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బీ టౌన్ హాట్ బ్యూటీ అలియ భట్ నటిస్తుందని తెలుస్తుంది.
సినిమాలో హీరోగా హవీష్ నటిస్తాడట. జీనియస్, నువ్విలా సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన హవీష్ ప్రస్తుతం రెండు మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. వర్మ హవీష్ హీరోగా చేస్తున్న ఈ బ్యూటీఫుల్ మూవీలో అలియా భట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానుంది. కేవలం బాలీవుడ్ లోనే తీస్తారో లేక తెలుగులో కూడా నిర్మిస్తారో తెలియదు కాని అలియాతో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన హవీష్ ను చూసి మిగతా హీరోలంతా అసూయ పడుతున్నారు.