
మలయాళ ప్రేమంతో అక్కడ హిట్ కొట్టడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది అనుపమ పరమేశ్వరన్. అఆ, ప్రేమం హిట్ తో పాటుగా సోలో హీరోయిన్ గా వచ్చిన శతమానం భవతి కూడా సూపర్ హిట్ అవడంతో అమ్మడికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఈ క్రేజ్ తోనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమాలో అనుపమ లక్కీ ఛాన్స్ కొట్టేసింది అన్నారు. కాని ఏమైందో ఏమో కాని ఆ సినిమా నుండి అనుపమని తప్పించారట.
సుకుమార్ కాంబినేషన్ లో చెర్రి హీరోగా రాబోతున్న ఈ మూవీ అనుపమ తప్పుకోడానికి గల కారణాలేంటో తెలియలేదు. అంతేకాదు దిల్ రాజు నిర్మాణంలో ఓ మై ఫ్రెండ్ డైరక్టర్ వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కూడా అనుపమని హీరోయిన్ గా అనుకున్నారు కాని మళ్లీ ఎందుకో ఆ సినిమా నుండి ఆమెను తీశారట. ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా అనిపించుకున్న అనుపమ రెండు లక్కీ ఛాన్సులు వదులుకోవడం కాస్త షాకింగ్ గానే ఉంది. మరి అనుపమ కావాలని వదులుకుందా లేక ఆమెను కావాలని తప్పించారా తెలియదు కాని మెగా పవర్ స్టార్ ఛాన్స్ మిస్ అయిన అనుపమ చూసి పాపం అనేస్తున్నారు అందరు.