మహేష్ చరణ్ న్యూ బిజినెస్..!

ఈమధ్య స్టార్ హీరోల మధ్య సాన్నిహిత్యం ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ క్రిస్ మస్, న్యూ ఇయర్ ఈవెంట్ లలో సర్ ప్రైజ్ గా కలిసి కనిపించిన మహేష్ చరణ్ లు ఇప్పుడు మరో ముందడుగేసి కలిసి ఓ బిజినెస్ కూడా చేస్తున్నారట. ఇప్పటికే ఎయిర్ లైన్స్ బిజినెస్ లో అడుగుపెట్టిన చరణ్ ఇప్పుడు హోటల్ బిజినెస్ లో కూడా దిగుతున్నాడు. చెర్రికి మహేష్ సపోర్ట్ కూడా దొరికింది.

మహేష్ చరణ్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ చేస్తారట. రీసెంట్ గా జరిగిన మహేష్ భార్య నమ్రత బర్త్ డే ఈవెంట్ లో కూడా చరణ్ ఉపాసనలు కనిపించారు. సో మహేష్ చరణ్ ల మధ్య బాండింగ్ క్రేజీగా మారిందని చెప్పొచ్చు. ఇక ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ కూడా తీస్తే ఇటు బాక్సాఫీస్ కూడా షేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొత్తగా కనిపిస్తున్న చెర్రి మహేష్ ల రిలేషన్ ఫ్యాన్స్ కు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.