క్రిష్ కొట్టేసిన మెగా ఛాన్స్..!

శాతకర్ణి సక్సెస్ తో సూపర్ ఫాంలోకి వచ్చిన క్రిష్ ఇప్పుడు తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కంచె తర్వాత వరుణ్ తేజ్ తో రాయభారి సినిమా ఎనౌన్స్ చేసిన క్రిష్ అది కాకుండా బాలయ్య వందవ సినిమాగా శాతకర్ణిని తెరకెక్కించాడు. ఆ సినిమా అంచనాలను మించి రావడంతో క్రిష్ అంటే స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక అదే క్రమంలో తను తర్వాత అనుకున్న రాయభారి సినిమా వరుణ్ తేజ్ చేతి నుండి మెగా పవర్ స్టార్ రాం చరణ్ చేతిలోకి వెళ్లిందని టాక్. రీసెంట్ గా ధ్రువ సక్సెస్ తో మరోసారి తన సత్తా చాటుకున్న చెర్రి ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ తో రాయభారి సినిమా చేస్తాడట చరణ్. మరి క్రిష్ అందుకున్న ఈ మెగా ఛాన్స్ తో ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో చూడాలి.