మెగా కాంబో నిజం కాబోతుందా..!

మెగాస్టార్ రీ ఎంట్రీతో మెగా కాంపౌండ్ లో ఉత్సాహం రెట్టింపయ్యింది. రావడం రావడమే ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి కొట్టిన ఖైది నంబర్ 150 హిట్ ను పురస్కరించుకుని ప్రముఖ పారిశ్రామిక వేత్త టి సుబ్బిరామిరెడ్డి ఓ వేడుక ఏర్పాటు చేశారు. పదేళ్ల తర్వాత మెగాస్టార్ కొట్టిన ఈ హిట్ గురించి మాట్లాడుతూ మెగాస్టార్, పవర్ స్టార్, రాం చరణ్, అల్లు అర్జున్ లతో కలిపి ఓ సినిమా చేస్తానని అన్నారు. ఇదేదో సరదాగా అంటున్న మాట అనుకున్నారు కాని ప్రస్తుతం ఉత్సాహం చూస్తుంటే అది నిజమవుతుందని అంటున్నారు.

అయితే మెగా వేడుకలకే దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి మెగా మల్టీస్టారర్ లో నటిస్తాడా అంటే.. ఏమో చెప్పలేం అంటున్నారు. కాని సుబ్బిరామిరెడ్డి గారు తలచుకుంటే ఏమైనా చేయగలరు. ఇక ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత అశ్వనిదత్ కూడా భాగమవుతున్నాడని తెలుస్తుంది. మరి మెగా కాంబో సినిమా వస్తే కనుక మెగా ఫ్యాన్స్ కు అంతకుమించిన ట్రీట్ మరోటి ఉండని చెప్పొచ్చు. ఇప్పటికే మెగా 150 సినిమాతో మంచి జోష్ లో ఉన్న ఫ్యాన్స్ ఈ సినిమా షురూ అయితే కనుక వారి ఆనందానికి అవధులుండవని చెప్పొచ్చు.