
సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లో ఎంత బిజీగా ఉంటారో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు.. షూటింగ్ గ్యాప్ లో సరదాగా ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసే మహేష్ తన భార్య నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా తన గురించి ట్వీట్ చేశారు. నా బలం.. జీవితానికి వెలుగు అయిన నా ప్రియమైన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన విశెష్ అందించారు మహేష్.
వంశీ సినిమాలో ఇద్దరు కలిసి నటించగా అక్కడ నుండి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. తను ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి మహేష్ ఇస్తున్న ప్రాముఖ్యత చూసి మిగతా హీరోలు కూడా జలస్ ఫీల్ అవుతుంటారు. తన భార్య మీద ప్రేమను మహేష్ తెలిపిన విధానం చూసి చెప్పొచ్చు వారి మధ్య ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో. ప్రస్తుతం మురుగదాస్ కాంబినేషన్ లో మూవీ చేస్తున్న మహేష్ ఈ నెల 26న ఆ సినిమా టైటిల్ తో పాటుగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.