
నిన్నటిదాకా హీరోయిన్ గా ఉన్న సమంత త్వరలోనే అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగు పెట్టబోతుంది. అయితే నాగ చైతన్యతో పాటుగా నాగార్జునతో కూడా మనంలో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత నాగార్జునను ఏమని పిలవాలే అనే కన్ ఫ్యూజన్ లో ఉందట. ప్రేమ పెళ్లి కహాని ఏం లేక ముందు నాగ్ సార్ అని పిలిచిన సమంత ఇప్పుడు కాబోయే మామ గారిని ఎలా పిలవాలని ఆలోచిస్తుందట. అయితే ఈమధ్య రెండు మూడు సార్లు తమ మీటింగ్ లో నాగార్జునను మళ్లీ నాగ్ సార్ అని అనగానే నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.
ఇక నుండి తనను అంకుల్ అని పిలవాలని అన్నాడట. ఇక అఖిల్ కాబోయే భార్య మాత్రం చిన్న నాటి నుండి తెలుసు కాబట్టి నాగ్ ను అంకుల్ అని పిలుస్తుందట. మరి సమంత ఎప్పుడు నాగార్జునని అంకుల్ అని పిలుస్తుందో. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరుగనున్న చైతు సమంతలు ప్రస్తుతం జాలీ ట్రిప్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తారని కూడా తెలుస్తుంది.