
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 ఎన్నో రికార్డులను కొల్లగొడుతుంది. ఇప్పటిదాకా బాక్సాఫీస్ పై తన వీర ప్రతాపం చూపించిన సినిమాల పని పడుతున్నాడు చిరంజీవి. రావడం లేట్ అయ్యింది కాని వస్తే ఎలా ఉంటుందో తన స్టామినా కలక్షన్స్ రూపంలో చూపిస్తున్నాడు. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు చిరు సొంతం అయ్యాయి. ఏరియా వైజ్ అయితే ఇప్పటిదాకా చిరు రికార్డును బద్ధలు కొట్టే హీరోనే లేడు. ఆ క్రమంలో చిరు నటించిన ఇంద్ర సినిమా టోటన్ రన్ లో 18 లక్షల షేర్ కలెక్ట్ చేసింది.
దేశం అంతా మెచ్చిన బాహుబలి సినిమా కూడా ఈ ఏరియాలో ఆ షేర్ కలెక్ట్ చేయలేదు. కాని రీసెంట్ గా రిలీజ్ అయిన చిరంజీవి ఖైది నంబర్ 150 మూవీ తునిలో కేవలం 11 రోజుల్లోనే ఆ రికార్డుని బ్రేక్ చేసిందట. సో తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుని మరోసారి తన స్టామినా ఇదని ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్. పదేళ్ల తర్వాత కూడా తన ఫాలోయింగ్ ఏమాత్రం తరగలేదని చిరు ఈ సినిమా కలక్షన్స్ తో చూపించాడు. కరెక్ట్ సినిమా బడితే చిరు లాంటి హీరో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో తెలిసింది.