జల్లికట్టుని వదలని వర్మ..!

సంచలనం తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు ఆర్జివి.. దర్శకుడిగా కన్నా విమర్శకుడిగా వర్మ చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. తనతో వితండవాదం చేసేందుకు ఎవరు సాహసించరు. అయితే తెలుగు ప్రేక్షకులు.. తెలుగు సెలబ్రిటీస్ అంటే వర్మ గురించి తెలుసు కనుక అతను ఏం చేసినా చెల్లి పోతుంది కాని వర్మ ఇప్పుడు తమిళనాడులో మేజర్ ఇష్యూ అయిన జల్లికట్టు మీద వెటకారంగా ట్వీట్ చేశాడు. జల్లికట్టుకి సపోర్ట్ చేస్తున్న వారిని ఒక్కొక్కరి వెనుక 1000 ఎద్దులను వదిలితే వారిని ఎవరు కాపాడతారో తెలుసుందని ట్వీట్ చేశాడు.

కేవలం టికెట్ల కోసమే సెలబ్రిటీస్ ఈ జల్లికట్టుని సపోర్ట్ చేస్తున్నారంటున్న వర్మ మూగ జంతువులకు ఎవరు సపోర్ట్ చేస్తారంటూ ట్వీట్ చేశాడు. అయితే తెలుగు దర్శకులు దీని గురించి పట్టించుకోకపోయినా సరే తమిళ దర్శకులు మాత్రం వర్మ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి అలగనూర్ వచ్చి మీ అభిప్రాయం మా కుర్రాళ్లతో చెప్పండి సార్.. వాళ్ల ఫీలింగ్ ఏంటో చూడండి.. మీ కోసం మేం ఎదురుచూస్తాం అంటూ దర్శకుడు వెంకట్ ప్రభు వర్మకు రీ ట్వీట్ చేశాడు. అంతేకదు పిజ్జా డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కూడా వర్మ ట్వీట్స్ ను ఉద్దేశిస్తూ నువ్వు మా లిస్టులో లేవు గోపాలా అని రీ ట్వీట్ చేశాడు. మరి తమిళ తంబీల గురించి తెలిసి కూడా వర్మ ఇంతటి సాహసం చేశాడంటే వర్మని మెచ్చుకోవాల్సిందే.. మరి వర్మ చేసిన ఈ ట్వీట్ ఎలాంటి రచ్చకు దారితీస్తాయో చూడాలి. అక్కడ సూపర్ స్టార్స్ అంతా కూడా జల్లికట్టుకి సపోర్ట్ ఇస్తుంటే.. వర్మ మాత్రం దానికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం.