
మెగాస్టార్ రీ ఎంట్రీ ఏ రేంజ్లో ఉండాలనుకున్నారో అంతకుమించి ఖైది నంబర్ 150 సంచలన విజయం అందుకుంది. పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఇసుమంత కూడా తరగలేదని చూపించి బాక్సాఫీస్ చెడుగుడు మొదలుపెట్టాడు మెగాస్టార్. వినాయక్ డైరక్షన్లో వచ్చిన ఖైది నంబర్ 150 రికార్డ్ కలక్షన్స్ తో మెగాస్టార్ సత్తా చాటుతుంది. అయితే మెగా మూవీ 150వ సినిమాకు రిస్క్ తీసుకోలేక కత్తి రీమేక్ ను ప్రిఫర్ చేసిన చిరంజీవి ఈసారి స్ట్రైట్ సినిమా చేయాలన్ ఫిక్స్ అయ్యారు.
అంతేకాదు చిరు తన 151వ సినిమా సురేందర్ రెడ్డితో.. 152వ సినిమా బోయపాటి శ్రీనుతో చేస్తున్నానని ఎనౌన్స్ చేశారు. ఖైది సక్సెస్ పట్ల తన సంతోషాన్ని ప్రకటిస్తూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి. ఇదవరకు సినిమా సక్సెస్ రోజులతో కొలిస్తే ఇప్పుడు కలక్షన్స్ తో లెక్కేస్తున్నారంటూ పరిశ్రమలో వచ్చిన మార్పులను గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాను ఈ పదేళ్లు ముఖానికి మాత్రం రంగు వేసుకోలేదు కాని తన ఇంట్లో హీరోల సినిమాలతో సినిమాలకు టచ్ లోనే ఉన్నానని అన్నారు చిరంజీవి. మొత్తానికి మెగా ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ఇదే మేనియా కంటిన్యూ చేస్తూ సినిమాలు రావాలని ఆశిద్దాం.