
లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందవ సినిమా ఎలా ఉండాలనుకున్నాడో ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా వచ్చింది. శాతకర్ణిగా బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఈ సినిమా సక్సెస్ లో భాగంగా దర్శకుడు క్రిష్ తో దర్శకధీరుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూ చేశాడు.
సినిమా అనుభవాలతో జరిగిన ఈ ఇంటర్వ్యూలో శాతకర్ణి గురించి క్రిష్ మొత్తం ఓపెన్ అయ్యాడు. సంవత్సరం క్రితం క్రిష్ తో బాలకృష్ణ సినిమా అని ఎనౌన్స్ కాగానే మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణకు క్లాస్ సినిమాలు తీసే క్రిష్ కాంబినేషన్ సినిమా ఎలా సెట్ అవుతుందో అర్ధం కాలేదని అన్నాడు రాజమౌళి. అంతేకాదు సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కూడా అనుకున్నాడట. కాని నిర్మాత సాయి కొర్రపాటి ఇద్దరు కలిసి తీసే సినిమా శాతకర్ణి అని చెప్పగానే కాస్త నమ్మకం కలిగిందని.. ఇక ట్రైలర్ చూశాక సినిమా హిట్ గ్యారెంటీ అని అనుకున్నానని అన్నారు. సో బాలయ్యతో క్రిష్ సినిమా మీద రాజమౌళి మొదటి ఒపినియన్ మాత్రం నెగటివ్ గానే ఉందన్నమాట. అలాంటి వాటిని ఎదుర్కుని సక్సెస్ సాధించి తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు క్రిష్.