
యంగ్ రెబల్ స్టార్ పెళ్లిపై ఎలాంటి న్యూస్ వచ్చినా సరే అదే పెద్ద సంచలనమే. ఇప్పటికే చాలాసార్లు పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి గురించి మీడియా చేస్తున్న హడావిడి గురించి ఫైర్ అవుతూ వచ్చారు. మొన్నామధ్య ఏకంగా ప్రభాస్ పెళ్లి చేసుకునేది గోదావారి జిల్లా అమ్మాయినే అంటూ రచ్చ చేశారు. ఈ క్రమంలో రీసెంట్ గా కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లిపై నోరు విప్పారు.
బాహుబలి రెండు పార్ట్ ల కోసం దాదాపు నాలుగు సంవత్సరాల రీల్ లైఫ్ రియల్ లైఫ్ త్యాగం చేసిన ప్రభాస్ ఈమధ్యనే పార్ట్-2 లో తన షూట్ ముగించుకున్నాడు. ఇక సినిమా కూడా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుండగా ఆ సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అధికారికంగా చెప్పారు కృష్ణం రాజు. అయితే పెళ్లికూతురు ఎవరన్నది మాత్రం బయట పెట్టలేదు.
ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నాళ్ల నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇదో బ్రేకింగ్ న్యూస్ అన్నట్టే. బాహుబలి-2 రిలీజ్ ఆ తర్వాత పెళ్లి ఆ వెంటనే సుజిత్ సినిమా ఇలా పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట ప్రభాస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తో పెళ్లిపీటలెక్కే ఆ లక్కీ గాళ్ ఎవరో చూడాలి.