
మెగాస్టార్ ఎంట్రీతో బాక్సాఫీస్ లెక్కల్లో తేడాలొచ్చేశాయి. పదేళ్ల తర్వాత తన పంజా విసిరిన మెగాస్టార్ చిరంజీవి తన దండయాత్ర మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తన ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న వైజాగ్ ప్రాంతంలో చిరు ఖైది నంబర్ 150 రికార్డు కలక్షన్స్ సృష్టించింది. మొదటి వారం లోనే మెగా రికార్డులతో మోత పెట్టించిన ఖైది వైజాగ్ ఏరియాలో చరిత్ర సృష్టించింది.
వైజాగ్ లో బాహుబలి సినిమా ఫుల్ రన్ లో 9.52 కోట్ల హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించింది. ఇది కేవలం ఏరియా రికార్డ్ మాత్రమే కాదు ఆల్ టైం రికార్డ్.. అయితే ఈ రికార్డుని ఖైది నంబర్ 150 కేవలం పది రోజుల్లోనే క్రాస్ చేసింది. పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గించని మెగా మేనియాకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లు ఏ కలక్షన్స్ అయినా సరే బాహుబలి ముందు ఆ తర్వాత అనేవారు.. కాని కొత్తగా ఖైది సృష్టించిన రికార్డులతో ఖైది ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే రేంజ్ కలక్షన్స్ తో కొనసాగితే ఫుల్ రన్ లో మెగాస్టార్ భారీ వసూళ్లను రాబట్టి సెకండ్ హయ్యెస్ట్ మూవీగా నిలబడే అవకాశాలున్నాయి.