
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి కన్ క్లూజన్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న చిత్రయూనిట్ దానికి తగ్గ ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా బాహుబలి ది బిగినింగ్ కంటే ముందు ఏం జరిగింది అన్న కథతో ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకం రాబోతుంది.
ప్రముఖ రచయిత నీలకంఠన్ రచనలో రాబోతున్నఈ పుస్తక ముఖచిత్రం జయపురలో జరుగుతున్న సాహిత్య వేడుకల్లో ఆవిష్కరించారు. బాహుబలి చిత్రయూనిట్ సమక్షంలో రిలీజ్ చేసిన ఈ పుస్తక ముఖచిత్రం ఈ రేంజ్ లో జరుగడం చూస్తుంటే బాహుబలి-2 ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ బుక్ లో బిగినింగ్ కథకు ముందు కథా ప్రస్థావించడం జరుగుతుందట. ఈరోజు ఆ కార్యక్రమం నుండి ఆడియెన్స్ తో తను దిగిన సెల్ఫీతో పాటుగా పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని ట్వీట్ చేశారు రాజమౌళి.