తారక్ కోసం మోహన్ లాల్.. మహేష్ కోసం అతను..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ మూవీ తర్వాత కొరటాల శివ డైరక్షన్లో మూవీ చేస్తాడని తెలిసిందే. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఈ సినిమాకు ఇప్పటికే భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమాలో మహేష్ సిఎం పాత్రలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కోలీవుడ్ హీరో మాధవన్ నటిస్తాడని తెలుస్తుంది. కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో సపోర్టింగ్ గా టాప్ రేంజ్ యాక్టర్స్ తీసుకుంటాడు.

జనతా గ్యారేజ్ లో తారక్ పక్కన మోహన్ లాల్ ను జత చేర్చాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా మాధవన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకున్నా సరే తను నటించిన తమిళ సినిమాలతో మాధవన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మణిరత్నం సఖి సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మాధవన్ ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక చాలా రోజుల తర్వాత మహేష్ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట.

అయితే మహేష్ తో మ్యాడీ చేస్తున్న సంగతి ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఒకవేళ చేసినా మాధవన్ రోల్ ఏంటి అన్నది కూడా తెలియాల్సి ఉంది. మరి ఓ పక్క హీరోగా చేస్తూ మరో పక్క సపోర్టింగ్ గా చేయాలనుకుంటున్న మాధవన్ కు ఈ సినిమా చాలా ప్రత్యేకం అవనుంది.