
నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ వస్తుందని ఈమధ్య హడావిడి చేస్తున్న న్యూస్. దిల్ రాజు బ్యానర్లో శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్లో ఈ మూవీ ఉండబోతుందని న్యూస్. అయితే ఈ వార్త తెలిసిన నాగార్జున షాక్ అవడం జరిగిందట. తన సినిమా న్యూస్ తన ప్రమేయం లేకుండా ఎలా ఎనౌన్స్ అవుతుందని అవాక్కయ్యాడట. ఇక దానికి వివరణ ఇస్తూ తను చైతు ఎలాంటి మూవీ చేయట్లేదని ట్వీట్ చేశారు నాగార్జున.
ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న నాగార్జున, నాగ చైతన్యతో మల్టీస్టారర్ న్యూస్ తెలిసి షాక్ అయ్యారట. దిల్ రాజు ఎనౌన్స్ చేశారని వార్తలు రాగా నాగ్ అతనికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారట. ఇప్పటికే నాగార్జున నాగ చైతన్యలు కలిసి మనం సినిమా చేయగా లాస్ట్ ఇయర్ వచ్చిన మనంలో కూడా చైతు పక్కన కొసమెరుపుగా కనిపించారు నాగార్జున. మరి ఈ మల్టీస్టారర్ కథ ఎవరు పుట్టించారో తెలియదు కాని మొత్తానికి ఇదో ఫేక్ న్యూస్ అని మాత్రం క్లియర్ గా తెలిసింది.