
ప్రస్తుతం తమిళనాడులో సంచలన రేపుతున్న జల్లికట్టు గురించి అక్కడ సిని తారలే కాదు తెలుగు సిని పరిశ్రమకు సంబందించిన వారు కూడా సపోర్ట్ అందిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు స్టూడెంట్స్ చేస్తున్న ఈ పోరాటానికి తన మద్ధతు ఇస్తూ ట్వీట్ చేయగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద ట్వీట్ చేయడం జరిగింది. పవన్ ప్రస్థావనలో జల్లికట్టు మాత్రమే కాదు కోడిపందేలా ఆట కూడా ప్రస్థావించడం జరిగింది.
సంస్కృతి సంప్రదాయాల మీద తమిళనాడు ప్రజలు చేస్తున్న ఈ పోరాటం బాగుందని.. ట్వీట్ రూపంలో తన సపోర్ట్ అందించాడు మహేష్. ఇక జల్లికట్టు బ్యాన్ చేయడం అంటే ద్రవిడ సంస్కృతిని దెబ్బతీయడం లాంటిదంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. తాను పొలాచిలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి వారు తమ కష్టాలు తనతో పంచుకున్నారని ప్రస్థావించిన పవన్ జల్లికట్టు, కోడిపందేల మీద కాకుండా గో మాసం ఎగుమతులు, కోళ్ల ఫారాల మీద దృష్టి పెట్టాలని జల్లికట్టుకి తన మద్ధతు తెలిపారు.