సర్దార్ గబ్బర్ సింగ్ మరోసారి 'పవర్' చూపిస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన బిజినెస్ 'పవర్' మరోసారి చూపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' బిజినెస్ లో సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ పంపిణీ హక్కులను చేజిక్కించుకున్న ఈరోస్ ఇంటర్ నేషనల్ సంస్థ ఏరియా వారీగా చిత్రాన్ని అమ్మేస్తోంది. ఈ క్రమంలో సీడెడ్ హక్కులు 10 కోట్ల 70 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించగా ... తాజాగా వైజాగ్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులు కూడా ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడుపోయాయి. వైజాగ్ హక్కులు 7.2 కోట్లకు, తూర్పు గోదావరి 6.2 కోట్లకు, పశ్చిమ గోదావరి 4.6 కోట్లకు అమ్ముడై ట్రేడ్ వర్గాలలో సంచలనం రేపాయి. గతంలో పవన్ నటించిన 'గబ్బర్ సింగ్' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ 'సర్దార్ గబ్బర్ సింగ్'కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇందులో పవన్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారిగా కథానాయికగా నటిస్తోంది. -