
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. పల్లెటూరి ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా జనవరి 30న పూజా కార్యక్రమాలను జరుపనున్నారు. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ ను కొత్తగా ప్రెజెంట్ చేయనున్నారట. ఇప్పటికే 2016 ఎండింగ్ లో ధ్రువ అంటూ వచ్చి తన సత్తా చాటిన చెర్రి మేకోవర్ ఫ్యాన్స్ కే కాదు సిని ప్రియులకు మంచి ట్రీట్ అందించింది.
ఇక రాబోతున్న సుకుమార్ సినిమాలో కూడా చెర్రి కొత్త లుక్ తో కనిపిస్తాడట. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. మెగాస్టార్ ఎంట్రీతో మెగా మేనియాతో మొదలైన ఈ సంవత్సరం మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా అది కంటిన్యూ చేస్తాడని తెలుస్తుంది. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.