రాశి ఖన్నా లక్కీ ఛాన్స్..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ రాశి ఖన్నా సూపర్ క్రేజ్ తో స్టార్ హీరోల ఛాన్సులు రాకున్నా సరే మంచి క్రేజ్ దక్కించుకుంది. యువ హీరోలతో నటిస్తూ మంచి జోష్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీకి ఆమెని సెలెక్ట్ చేశారని టాక్ రాగా ఇప్పుడు మరో లక్కీ ఆఫర్ ఆమె చెంత చేరిందట. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్లో చేస్తున్న మూవీ జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా రాశి సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు.

ఇన్నాళ్లు కుర్ర హీరోలతో జోడి కట్టి రాశి ఖన్నా ఒకేసారి రెండు భారీ సినిమాల ఛాన్సులు అందుకుంది. ఇప్పటికే సినిమాకు సినిమాకు గ్యాప్ లో హాట్ ఫోటో షూట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా ఇప్పుడు స్టార్ ఆఫర్స్ తో కనువిందు చేయనుంది. ప్రస్తుతం అమ్మడు సెట్స్ మీద రెండు మూడు సినిమాల షూట్ లో ఉండగా ఈ ఏడాది రాశి ఇమేజ్ టాప్ రేంజ్ కు వెళ్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరి వచ్చిన ఈ లక్కీ స్టార్ ఆఫర్స్ ను రాశి ఖన్నా ఏవిధంగా వినియోగించుకుంటుందో చూడాలి.