
టాలెంట్ ను మెచ్చుకోవడమే కాదు దాన్ని వెలికితీయడంలో స్టార్ హీరోలు ఇప్పుడు కొత్త ఉత్సాహం తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర.. సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు భారీ సినిమాలకు మాటలను అందించాడు. తన మాటలతో వారెవా అనిపిస్తున్న సాయి మాధవ్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఇక ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సాయి మాధవ్ కు కబురు పంపించాడట. ఇప్పటికే గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు సాయి మాధవ్ తో పనిచేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న కాటమరాయుడు సినిమాకు అతనితో మాటలు రాయిస్తున్నాడట. కిశోర్ పార్ధసాని డైరక్షన్లో వస్తున్న కాటమరాయుడు ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తుంది. మరి పవర్ స్టార్ స్టామినాకు తగ్గ డైలాగులను అందించిన్ ఆ సినిమా హిట్ కు సాయి మాధవ్ ఎంత సహకారం అందిస్తున్నాడో చూడాలి.