
నందమూరి బాలకృష్ణ నటించిన వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమాలో ముఖ్యంగా డైలాగులకు థియేటర్లో విజిల్స్ వేస్తున్నారు. సినిమాలోని డైలాగులను ట్రైలర్ తోనే రుచి చూపించిన క్రిష్ ఇక సినిమా మొత్తం అలాంటివి ఎన్నో ఉండేలా చూసుకున్నాడు. కథ కథనాలతో పాటుగా డైలాగుల మీద పూర్తి అవగాహనతో తీసిన శాతకర్ణి అందరి మన్నలను పొందింది.
అయితే శాతకర్ణి సినిమా డైలాగులను అనుకరిస్తూ సింగర్ మధు రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తుంది. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా అనే ఫేమస్ డైలాగ్ తో మొదలుపెట్టి.. ఇప్పటిదాకా ఉనికిని నిలుపుకున్నాం. ఇక ఉనికిని చాటుదాం. దొరికినవాడిని తురుముదాం. దొరకని వాడిని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం.. అంటూ బాలయ్య పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగులను తను కూడా అంతే ఎమోషన్ తో చెప్పింది సింగర్ మధు.
ఇక ముగింపుగా మనం కథలు చెప్పకూడదు. మన గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి అంటూ 1500 సంవత్సరాల క్రితమే దేశ సమైక్యతను చాటి చెప్పి.. శత్రు సైనికుల్ని మట్టికరిపించి.. పరదేశీ దండయాత్రికుల్ని తరిమి తరిమి కొట్టిన ఆ వీరుడు గౌతమీపుత్ర శాతకర్ణీ సాహో అంటూ ఓ సొంత డైలాగ్ కూడా యాడ్ చేసి వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం శాతకర్ణి గురించి ఏం జరిగినా అదో పెద్ద సంచలనం అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న శాతకర్ణి డైలాగులతో సింగర్ మధు వీడియో మీకోసం.