
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే మలయాళంలో జనతా గ్యారేజ్ కు అంత ప్రమోషన్స్ చేయలేక అక్కడ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక ఆ సినిమాతో ఏర్పడ్డ చనువుతో ఇప్పుడు తెలుగులో తన సినిమా ప్రమోషన్స్ కు ఎన్.టి.ఆర్ ను వాడుకోవాలని చూస్తున్నాడు మోహన్ లాల్. ఈ కంప్లీట్ స్టార్ నటించిన లేటెస్ట్ మలయాళ హిట్ మూవీ ఒప్పం.
తెలుగులో కనుపాపగా రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా తెలుగు ఆడియో రిలీజ్ ఈ నెల 25న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇక ఈ ఆడియోకి తారక్ ను ఇన్వైట్ చేస్తున్నారట. తనను ఆప్యాయంగా పిలిస్తే తప్పకుండా ఎలాంటి వారి సినిమా ఫంక్షన్ కు అయినా వచ్చే తారక్ మోహన్ లాల్ పిలిస్తే కనుక తప్పకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూనియర్ వస్తే కనుక ఇక కనుపాపకు భారీ ప్రమోషన్ ఏర్పడినట్టే. మనమంతా, జనతా గ్యారేజ్ తో తెలుగులో ఏర్పడ్డ మార్కెట్ తో తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మోహన్ లాల్.
రీసెంట్ గా మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఇరుమురుగన్ తెలుగులో మన్యం పులిగా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. మరి రిలీజ్ అవుతున్న కనుపాప ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.