
మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే మూడు సినిమాలను తీసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ కథలతో మెగా హీరోల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈరోజు ఈ మెగా హీరో బర్త్ డే ఈ సందర్భంగా వరుణ్ తేజ్ నటిస్తున్న ఫిదా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు లవ్ హేట్ లవ్ స్టోరీ అని ట్యాగ్ తగిలించారు.
ఈ సంవత్సరం ఇప్పటికే శతమానం భవతి సినిమాతో హిట్ అందుకున్న దిల్ రాజు వచ్చే నెలలో నాని నేను లోకల్ మూవీతో వస్తున్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ ఫిదాను కూడా ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓ పక్క శ్రీనువైట్ల డైరక్షన్లో మిస్టర్ మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ ఆ సినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా ప్రిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన మూడు సినిమాలతోనే ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న వరుణ్ తేజ్ ఇలాంటి మెమరబుల్ బర్త్ డేలు ఎన్నో జరుపుకుని సూపర్ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగించాలని ఆశిద్దాం.