నితిన్ విషయంలో నిర్మాత ఫైర్..!

లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నితిన్ ఓ హిట్ రెండు ఫ్లాపులా కెరియర్ కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ త్రివిక్రం డైరక్షన్లో అఆ హిట్ తో మంచి జోష్ చూపిస్తున్న నితిన్ నిర్మాత రాధామోహన్ తో గొడవపడుతున్నాడట. నితిన్ రాధామోహన్ కాంబినేషన్లో సినిమా చేయాలని కోటి రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడట. అయితే అఆ హిట్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ కూడా పెరగడంతో ఇప్పుడు ముందు కమిట్ అయిన రెమ్యునరేషన్ కు సినిమా చేయడం కుదరదని అంటున్నాడట నితిన్.

ఇక చేసేదేం లేక నితిన్ తో సినిమా ఆశలను వదిలేసుకున్న రాధా మోహన్ కనీసం తను ఇచ్చిన అడ్వాన్స్ ఎమౌంట్ కోటి తిరిగిచ్చేయమని అంటున్నాడట. కాని నితిన్ మాత్రం ఈ విషయంలో మొహం చాటేస్తున్నాడని తెలుస్తుంది. మరి కెరియర్ లో వరుస హిట్స్ వస్తున్న స్టార్ హీరోలు కూడా నిర్మాతలతో కాస్త జాగ్రత్తగా ఉంటుంటే నితిన్ మాత్రం ఒక్క హిట్ కే కాస్త తేడా వచ్చేసింది అంటున్నారు. తన తండ్రి ఎంత పెద్ద బడా డిస్ట్రిబ్యూటర్ అయినా నితిన్ నిర్మాతల కష్టాలని కూడా అర్ధం చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు సిని విమర్శకులు.