జూనియర్ సినిమా ఆ సీక్రెట్ నిజమేనా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ హిట్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని బాబితో తన తర్వాత సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే బాబితో చేసే సినిమాపై ఫిల్మ్ నగర్ లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ జై లవకుశగా వినిపిస్తుండగా.. ఇప్పుడు సినిమా కథ ఇదేనంటూ ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఇంతకీ అదేంటి అంటే జై లవ కుశ అంటూ మూడు విభిన్న పాత్రల్లో నటించబోతున్న తారక్ ఒక్కడే ముగ్గురిగా నటిస్తాడట.

కేవలం హైప్ కోసమే త్రిపాత్రాభినయం అంటూ ఫిల్లర్స్ వదులుతున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని తారక్ ఒక్కడే ముగ్గురిగా మూడు పాత్రల్లో నటించడం నిజంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక ఇలాంటి మిక్సెడ్ స్క్రీన్ ప్లే చూపించడంలో పవర్ తో బాబి సక్సెస్ అయ్యాడు కాబట్టి కచ్చితంగా ఈ సినిమా కూడా అంచనాలను మించి అవుట్ పుట్ ఉంటుందని అంటున్నారు. మరి బాబి మీద పెట్టుకున్న తారక్ నమ్మకం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 40 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 11న మూవీ లాంచ్ చేస్తుండగా ఆగష్టు కల్లా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.