వర్మ ఏంటి మాకి ఖర్మ..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా అదో సంచలనమే.. అయితే ఆయన చేసేది సంచలనం అయినా కాకపోయినా వర్మ ఏం చేసినా దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేసి సోషల్ మీడియానే అతన్ని హీరో చేసేస్తుంది. వర్మ ఒక్క మాట మీద నిలబడే మనిషి కాదు.. అది అతనే ఒప్పుకుంటాడు కూడా. అయితే నిన్న మొన్నటిదాకా మెగాస్టార్ 150వ సినిమా ఖైది నంబర్ 150ను బాలయ్య 100వ సినిమా శాతకర్ణితో పోలుస్తూ రఫ్ఫాడించిన వర్మ సడెన్ గా ప్లేట్ మార్చేసి ఇప్పుడు కొత్త రాగం పాడుతున్నాడు.

మెగా మెగా ఫెంటాస్టిక్ కంటే మెగాస్టార్ అద్భుతంగా ఉన్నాడు. అందుకు 150 మిలియన్ల చీర్స్ చెబుతున్నా.. ఎనర్జీ లెవల్స్ లో మెగాస్టార్ సుప్రీం అంతే.. 9 ఏళ్లు ఇండస్ట్రీని వదిలినా ఇంకా అందంగానే ఉన్నారంటూ చిరు 150వ సినిమా చూసి పొగడ్తలతో ముంచెత్తాడు వర్మ. మెగా హ్యాండ్సం గా మెగాస్టార్ కనిపిస్తున్నాడని ట్వీట్ చేశాడు. మరి మెగా షాక్ ఏమన్నా తగిలిందా లేక నిజంగా మెగాస్టార్ మేకోవర్ వర్మకి నచ్చిందా అన్నది తెలియదు కాని మెగాస్టార్ ను పొగుడుతూ వర్మ చేసిన ఈ ట్వీట్స్ చూసి పొగడటం తనవంతే తిట్టడం తనవంతే అనుకుంటున్న వర్మను చూసి వర్మ మాకేంటి కర్మ అని అనుకుంటున్నారు నెటిజెన్లు.