
బాహుబలి సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా అదో పెద్ద సంచలనమే.. మొదటి పార్ట్ మించి రెండో పార్ట్ షూట్ చేస్తున్న రాజమౌళి సినిమాపై ఎలాంటి క్లూస్ బయటకు వదలట్లేదు. అయితే ఏ సీక్రెట్ అయినా సరే అది తన ద్వారానే బయటకు రావాలని చూసిన జక్కన్నకు థర్టీ ఇయర్స్ పృధ్వి షాక్ ఇచ్చాడు. బాహుబలి-2 లో తన పాత్ర గురించి చెప్పి అందరికి అవాక్కయ్యేలా చేశాడు పృధ్వి. ఇంతకీ పృధ్వి రివీల్ చేసిన సీక్రెట్ ఏంటంటే బాహుబలి కన్ క్లూజన్ లో తన పాత్ర విషయాలను బయటపెట్టడమే.
అనుష్క దేవసేనగా నటిస్తుండగా ఆమె రాజ్యానికి మంత్రిగా పృధ్వి చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని పృధ్వినే స్వయంగా ఎనౌన్స్ చేశాడు. థర్టీ ఇయర్స్ పృధ్విగా ఈమధ్య మంచి క్రేజ్ సంపాదించిన పృధ్వి కమెడియన్స్ లో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. అయితే ఖైది నంబర్ 150లో తన సీన్స్ తీసేశారని రచ్చ చేసిన పృధ్వి ఇప్పుడు మరోసారి బాహుబలి-2 లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో ఉన్నానంటూ వార్తల్లో నిలిచాడు. ఇన్నాళ్లు కమెడియన్ గా నటించిన పృధ్వి ఈ పాత్రలో సీరియస్ గా కనిపించనున్నాడట. మరి పృధ్విలో ఈ యాంగిల్ ఎలా ఉండబోతుందో చూడాలి.